24-01-2026 08:14:16 PM
నంగునూరు,(విజయక్రాంతి): మండల కేంద్రంలోని ఎరువుల దుకాణాలను సిద్దిపేట ఏడీఏ పద్మ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దుకాణదారులు రైతులకు యూరియా కార్డుల ద్వారానే ఎరువులను పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. అనంతరం రైతులతో మాట్లాడుతూ... ప్రభుత్వ వ్యవసాయ పథకాలు నేరుగా అందాలంటే రైతులందరూ తప్పనిసరిగా గుర్తింపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రాయితీపై అందుబాటులో ఉన్న వ్యవసాయ యంత్ర పరికరాల కోసం అర్హులైన రైతులు దరఖాస్తు చేసుకోవాలని ఆమె కోరారు. ఆమె వెంట మండల వ్యవసాయ శాఖ అధికారి గీత ఉన్నారు.