3 July, 2026 | 2:17 AM

‘వికసిత్ భారత్ బిల్డదాన్’లో గీతా స్కూల్ విద్యార్థుల ప్రతిభ

03-07-2026 12:20 AM

- విద్యార్థులను అభినందించిన అదనపు కలెక్టర్ నగేష్

మెదక్, జులై 2 (విజయ క్రాంతి) : వికసిత్ భారత్ బిల్డదాన్ -2025 రాష్ట్రస్థాయి  కాంపిటీషన్ లో ఆన్లైన్ లో నిర్వహించగా తెలంగాణ రాష్ట్రం నుండి మూడు ప్రాజెక్టులు జాతీయ స్థాయికి ఎంపిక చేయగా అందులో ఒక ప్రాజెక్టు మన జిల్లాలోని గీతా స్కూల్ తూప్రాన్ విద్యార్థులు మహతి కృత్తిక రాజేష్ ఆశీష్ లు సంయుక్తంగా రూపొందించిన ప్రాజెక్టు జాతీయ స్థాయికి ఎంపికై నందున గురువారం కలెక్టరేట్ కార్యాలయంలో  విద్యార్థులను అదనపు కలెక్టర్ నగేష్ అభినందించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రతిభావంతులైన విద్యార్థుల వారి అపూర్వ మేధాశక్తి వెలకట్టలేనిది అన్నారు? ప్రతిభా పాటవాలకు పదును పెట్టి ఆన్లైన్లో ప్రాజెక్టు తయారు చేసి జాతీయస్థాయికి ఎంపిక కావడం గర్వించదగ్గ విషయమని కొనియాడారు.  వీరికి 25వేల నగదు పురస్కారం అందజేయబడుతుందన్నారు ఇదే స్ఫూర్తితో  మిగతా విద్యార్థులు జాతీయస్థాయిలో రాణించి జిల్లాకు గుర్తింపు తేవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి రాజు, సివిల్ సప్లై అధికారులు నిత్యానందం, జగదీశ్ అకాడమిక్ మానిటరింగ్ అధికారి సుదర్శనమూర్తి జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి మరియు ఉపాధ్యాయులు రాజేశ్వర్ లు పాల్గొన్నారు