‘సర్’పై అవగాహన కల్పించిన రాజ్‌కుమార్
డప్పు మల్లేష్ కు రూ.20వేల ఆర్థిక సాయం
పటాన్‌ఛెరు, జూలై 2 : పటాన్చెరు నియోజకవర్గం ముత్తంగి డివిజన్ పరిధిలోని పోచారం గ్రామంలో నిర్వహించిన సర్ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆర్కే ఫౌండేషన్ చైర్మన్ కాల్వగడ్డ రాజ్కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన గ్రామ ప్రజలతో, స్థానిక ప్రతినిధులతో కలిసి క్షేత్రస్థాయిలో జరుగుతున్న కార్యక్రమ వివరాలను, స్థానిక విధివిధానాలను నిశితంగా అడిగి తెలుసుకున్నారు. ముత్తంగి డివిజన్లోని ప్రతి గ్రామం సమగ్ర అభ్యున్నతికి, ప్రజా సంక్షేమానికి తాము ఎల్లప్పుడూ మొదటి వరుసలో ఉంటామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు డప్పు మల్లేష్ గత కొంతకాలంగా తీవ్రమైన కిడ్నీ వ్యాధితో బాధపడుతూ డయాలసిస్ చికిత్స పొందుతున్నారనే విషయం తెలుసుకొని స్వయంగా ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
వైద్య ఖర్చుల నిమిత్తం మల్లేష్ కుటుంబానికి రూ.20,000 తక్షణ ఆర్థిక సహాయాన్ని నగదు రూపంలో అందజేసి కొండంత భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు, మాజీ ఉపసర్పంచ్ భవాని రాజు, మాజీ సర్పంచ్ చీకటి నాగమణి, చీకటి బీరయ్య, ఎల్దనూరు ప్రశాంత్, సంకపల్లి రాజ్ కుమార్, కంజర్ల యాదగిరి, భవాని, గోపాల్, ఆర్కే ఫౌండేషన్ ముఖ్య సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.






