22-12-2025 09:04:37 PM
ఈ నెల 24 న మీ డబ్బు మీ హక్కు కార్యక్రమం
జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి
వనపర్తి టౌన్: ఎప్పుడో బ్యాంకులో డబ్బులు జమ చేసి మరచిపోవడం, బీమా, మ్యూచువల్ ఫండ్, డివిడెంట్ లు, స్టాక్ మార్కెట్ షేర్లు తదితర డబ్బులు తిరిగి పొందేందుకు రిజర్వు బ్యాంక్ ఆదేశాల మేరకు అక్టోబర్ 1 నుండి మరో అవకాశం కల్పించిందని అందులో భాగంగానే వనపర్తి జిల్లాలో ఉమ్మడి శిబిరం ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ సోమవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. డిసెంబర్ 24న ఐడీఒసీ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఈ ఉమ్మడి శిబిరం పనిచేస్తుంది.
10 ఏళ్లకు పైబడిన మరచిపోయిన లావాదేవీలు పొందేందుకు శిబిరంలో జిల్లా లోని బ్యాంకులు, బీమా సంస్థలు, డివిడెంట్ లు, స్టాక్ మార్కెట్ బ్రోకరేజ్ లు పాల్గొంటారని, వనపర్తి జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ డబ్బును క్లెయిమ్ చేసుకోవాల్సిందిగా సూచించారు. 10 సంవత్సరాలకు పైబడిన బ్యాంకు ఖాతాలు, డిపాజిట్ల వివరాలు తెలుసుకునేందుకు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్గం వెబ్సైట్(https://udgam.rbi.org.in) ద్వారా తెలుసుకోవచ్చని తెలియజేశారు.