calender_icon.png 1 June, 2025 | 8:24 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చింతచిగురు తప్పక తినాల్సిందే

31-05-2025 12:22:29 AM

కల్లూరు,మే30(విజయ క్రాంతి) చింతచిగురు సీజన్లో అందుబాటులో ఉంది. ఇది వాపులు, నొప్పులు తగ్గిస్తుంది, జీర్ణక్రియకు మద్దతు ఇస్తుంది, షుగర్ నియంత్రణలో స హాయపడుతుంది. విటమిన్ సి పుష్కలంగా ఉండి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వం టల్లో రుచిని పెంచే చింతపండు గురించి అందరికీ తెలిసిందే. అయితే దీని కాయలాగే చింతచిగురు కూడా ఆరోగ్యానికి మేలు చేసే అద్భుతమైన పదార్థం.

ఇప్పుడు చింతచిగురు సీజన్ కాబట్టి ఇది సులభంగా లభి స్తోంది. పల్లెప్రాంతాల్లో ఈ ఆకుల్ని విరివిగా వాడుతుంటారు. పప్పులు, పచ్చడులు, పులిహోరలు, మాంస వంటకాల్లో చింతచిగురు వాడితే అదిరిపోయే రుచి వస్తుంది. రుచి మాత్రమే కాదు, చింతచిగురులో ఎన్నో ఔష ధ గుణాలున్నాయని ఆయుర్వేదం చెబుతోంది. నొప్పులు, వాపులపై చింతచిగురు ప్రభావం చింతచిగురులో సహజ యాంటీ ఇన్ఫ్లామేటరీ లక్షణాలు ఉన్నాయి.

ఇవి శరీరంలోని వాపులు, కండరాల నొప్పులు, జా యింట్ పైన వచ్చే బెణుకులను తక్కువ చేస్తాయి. ఈ ఆకులను మెత్తగా నూరి గా యాలపై పూతలా వేసినా ఉపశమనం లభిస్తుంది. చర్మానికి తగలే వైరల్, ఫంగల్ ఇన్ఫె క్షన్లను తగ్గించడంలో కూడా ఇవి సహాయపడతాయి.జీర్ణక్రియకు అద్భుత మద్దతు చింత చిగురులో ఫ్లేవనాయిడ్స్, పాలిఫెనాల్స్ వం టి యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటా యి.

ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ను నాశనం చేస్తూ కణజాలాన్ని రక్షిస్తాయి. పేగుల పని తీరును మెరుగుపరుస్తాయి. అందుకే మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలకు ఇది సహ జ పరిష్కారం. అంతేకాదు, తినే ఆహారం సరి గ్గా జీర్ణమై ఆకలి బాగా పెరుగుతుంది. దీని వలన బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఇది ఉపయోగకరంగా మారుతుంది. 

షుగర్ పేషంట్లకు వరం

చింతచిగురు డయాబెటిస్ ఉన్నవారికి అమోఘమైన సహాయకారిగా మారుతుంది. ఇది రక్తంలోని గ్లూకోజ్ స్థాయిని నియంత్రణలో ఉంచడంలో తోడ్పడుతుంది. శరీరం ఇన్సులిన్ను సరిగ్గా ఉపయోగించేందుకు సహకరిస్తుంది. దీనివల్ల షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.

జ్వరం, దగ్గు, జలుబుకి సహజ ఔషధం

పూర్వ కాలంలో పెద్దలు జ్వరం వచ్చినప్పుడు చింతచిగురు సూప్ తాగేవారు. అది శరీరంలోని వేడిని తగ్గించి త్వరగా కోలుకునేలా చేస్తుంది. శ్వాస సంబంధిత ఇబ్బందు లు, దగ్గు, జలుబు వంటి వాటికి ఇది ఉపశమనాన్ని ఇస్తుంది. ఊపిరితిత్తుల్లో వాపును తగ్గించే గుణం దీనిలో ఉంది.

రోగనిరోధకశక్తిని పెంచే విటమిన్ సి

చింతచిగురులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది. వైరల్, బ్యాక్టీరియల్ సంక్ర మణల నుంచి రక్షణ కలిగిస్తుంది. చిన్నాపె ద్దా అందరూ దీన్ని తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.ఇప్పుడు చింతచిగురు సీజన్ నడుస్తోంది. మార్కెట్లలో, పల్లె ల్లో దీనిని సులభంగా దొరకజేయొచ్చు. ఈ చింతచిగురును మీ దైనందిన ఆహారంలో భాగం చేసుకుంటే రుచి తో పాటు ఆరోగ్య ప్రయోజనాలు అనేకం అందుతాయి. కాబ ట్టి ఈ సీజన్ను వదులుకోకుండా చింతచిగురును ఉపయోగించండి.