calender_icon.png 28 January, 2026 | 1:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ది వైశ్య క్రౌన్ పేజెంట్ గ్రాండ్ ఫినాలే

28-01-2026 01:13:18 AM

హైదరాబాద్‌లో నిర్వహణ

హైదరాబాద్, జనవరి 27 (విజయక్రాంతి): ‘ది వైశ్య క్రౌన్ పేజెంట్ మిస్ అండ్ మిసెస్ వైశ్య కాంటెస్ట్ 2025’ గ్రాండ్ ఫినాలేను సోమవారం సాయంత్రం హైదరాబా ద్ కందాపూర్‌లోని క్వేక్ అరేనాలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మడి శివకుమార్, సిం ధూరి వుప్పల స్థాపించిన ‘ది వైశ్య క్రౌన్’ సంప్రదాయ బ్యూటీ పేజెంట్లకు అతీతంగా, ఆర్యవైశ్య మహిళల సాధికారత, నాయకత్వం, సాంస్కృతిక గర్వాన్ని ప్రతిబింబించే వేదికగా రూపుదిద్దుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ది వైశ్య క్రౌన్ కేవ లం కిరీటాల గురించే కాదు. ఇది ఆత్మవిశ్వా సం, ధైర్యం, సమాజాన్ని ప్రభావితం చేసే వైశ్య మహిళల శక్తివంతమైన గుర్తింపును నిర్మించడానికే” అని అన్నారు.

సహ-స్థాప కురాలు సింధూరి వుప్పల మాట్లాడుతూ.. ‘ఈ వేదికపై నిలిచిన ప్రతి మహిళ ఒక స్ఫూర్తిదాయకమైన ప్రయాణానికి ప్రతిరూపం అని ఆమె పేర్కొన్నారు. ఈ పోటీలో ఐదు రాష్ట్రాల నుంచి ఎంపికైన 30 మంది ఫైనలిస్టులు పాల్గొన్నారు. ఫెమినా మిస్ ఇం డియా వరల్డ్ 2023, మిస్ వరల్డ్ 2025 టాప్ 20 ఫైనలిస్ట్ అయిన నందిని గుప్తా విజేతలకు కిరీటాలు అలంకరించారు. ప్రముఖ సెలబ్రిటీ జ్యూరీ సభ్యులు అక్షర గౌడ, ప్రిన్స్ సిసిల్, నిత్య నరేష్, లక్కీ వర్మ, పూనమ్ షైల్, రోమ్ భీమానా మరియు పవన్ సాయి మదింపు చేశారు.