బీఏవీడీ నూతన కార్యవర్గం
హైదరాబాద్, జూన్ 15 : బ్యాడ్మింటన్ క్రీ డాకారుల సంక్షేమం, వారి ప్రతిభా వికారం, క్రీడా అవకాశాల విస్తరణే ప్రధాన లక్ష్యంగా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ వికారాబాద్ డిస్ట్రిక్ట్(బీఏవీడీ) నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కొసరాజు లక్ష్మ ణ అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించగా, పు ల్లెల గోపీచంద్, జి.రమేష్, కె.సుభాష్‌రెడ్డి ఉపాధ్యక్షులుగా ఎన్నికయ్యారు.
యూవీఎన్ బాబు ప్రధాన కార్యదర్శిగా, ఎం.విజయ్‌కుమార్‌రెడ్డి, ఏవీ రమణారెడ్డి, వి.చిన్నయ్య సంయుక్త కార్యదర్శులుగా, పీవీఎల్ కుమార్ ట్రెజరర్‌గా ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా ఇ.దీప్తిషాలిని, జి.హరీష్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు అసోసియేషన్ స భ్యులు శుభాకాంక్షలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతిభను వెలికితీసేందుకు ప్రత్యే క కార్యక్రమాలు చేపడతామని కొత్త అధ్యక్షుడు కొసరాజు లక్ష్మణ్ తెలిపారు.






