10-07-2025 07:32:52 PM
తాండూరు పీహెచ్సీ ఆకస్మిక తనిఖీ..
సీజనల్ వ్యాధులపై వైద్య సేవలపై సూచనలు
జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి హరీష్ రాజు..
బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా తాండూరు మండలంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ హరీష్ రాజ్(District Medical Health Officer Dr. Harish Raj) ఆకస్మికంగా పర్యటించారు. గురువారం తాండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. వైద్య సిబ్బంది, వైద్యులకు తగిన సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని అన్ని విభాగాలను సందర్శించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది వివరాలు తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ప్రసవాలను చేయాలని ఆదేశించారు. ఆరోగ్య కేంద్రంలోని లేబర్ రూమ్, ఆపరేషన్ థియేటర్ ను పరిశీలించారు.
మందులు, వైద్య పరికరాలను తనిఖీ చేశారు. తాండూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డెలివరీలకు అన్ని సౌకర్యాలు ఉన్నవని దానికి తగిన విధంగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే పాము, కుక్క కాటు మొదలైన వాటి మందులు, వ్యాధులు ప్రబలినప్పుడు తీసుకోవలసిన చర్యలపై సూచనలు చేశారు. సంబంధించిన మందులు వివరాలను తెలుసుకున్నారు. అంతేకాకుండా జిల్లాలో వైద్యులు, వైద్య సిబ్బంది సమయపాలన పాటించాలని రౌండ్ క్లాత్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలన్నారు. ఏదైనా ప్రసూతి కి సంబంధించిన గర్భవతులు గానీ,ఇంకా ఎమర్జెన్సీ వైద్య కేసులపై తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కీటక జనత వ్యాధులు మలేరియా డెంగ్యూ చికెన్ గునియా లాంటివి అవకాశo ఉన్నందున ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. వ్యాధుల ప్రభావిత గ్రామాలలో సకాలంలో వైద్య శిబిరాలను ఏర్పాటు చేయాలనీ చెప్పారు. ప్రతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రాపిడ్ రెస్పాన్స్ టీం అదేవిధంగా ఉపకేంద్రంలలో సిబ్బందిని అందుబాటులో ఉంచాలని, ప్రతి ఆశా దగ్గర మందులను అందుబాటులో ఉంచాలన్నారు. ఆశ్రమ పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు విధిగా పరీక్షలు చేయాలని, అదే విధంగా డెంగ్యూ ప్రబలకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. గ్రామపంచాయతీ, మున్సిపల్ సిబ్బందితో సమన్వయంగా పనిచేస్తూ మండల వైద్యాధికారులు కోఆర్డినేషన్ మీటింగులు ఏర్పాటు చేసుకొని తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభావిత గ్రామాలు దూరము ఎలాంటిది కమ్యూనికేషన్ ట్రాన్స్పోర్ట్ లేని గ్రామాలలో ఉన్న ఈ డి డి దగ్గర ఉన్న గర్భవతులను తరలించడానికి ప్రణాళికల సిద్ధం చేసుకోవాలన్నారు.
అదేవిధంగా 108, 102 అంబులెన్స్ సర్వీస్ లను ఉపయోగించుకోవాలని తెలిపారు. కుటుంబ సంక్షేమ కార్యక్రమంలో భాగంగా రేపటినుండి జరిగే కుటుంబ సంక్షేమ కార్యక్రమాల పైన అవగాహన కల్పించాలన్నారు. తాతకాలిక పద్ధతులు, శాశ్వత పద్ధతుల గురించి అర్హులైన దంపతులకు తెలియజేయాలన్నారు. ఆయన వెంట జిల్లా మాస్ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఉన్నారు.