19-10-2025 12:00:00 AM
గుహావటి, అక్టోబర్ 18:బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో భారత యువ సంచలనం తన్విశర్మ చరిత్ర సృష్టించింది. సెమీస్‌కు చేరి మెడల్ ఖాయం చేసుకున్న తన్విశర్మ ఇప్పుడు ఫైనల్‌కు దూసుకెళ్ళింది. సెమీస్‌లో చైనా క్రీడాకా రిణి లియు సియాపై 15 15 స్కో ర్‌తో విజయం సాధించింది. తద్వారా ఫైనల్లో అడుగుపెట్టిన ఐదో భారత ప్లేయర్‌గా రికార్డులకెక్కింది. గతంలో పోపట్ (1996), సైనా నెహ్వాల్(2006,2008), సిరిల్ వర్మ(2015), శంకర్ ముత్తుస్వామి (2002) ఫైనల్‌కు చేరిన వారిలో ఉన్నారు.