calender_icon.png 20 October, 2025 | 2:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జ్యోతి సురేఖకు కాంస్యం

19-10-2025 12:00:00 AM

నాన్‌జింగ్, అక్టోబర్ 18: భారత ఆర్చరీ క్రీడాకారిణి, తెలుగు తేజం వెన్నం జ్యోతి సురేఖ చరిత్ర సృష్టించింది. ఆర్చరీ ప్రపంచకప్ ఫైనల్‌లో కాంస్యం పతకం గెలిచింది. తద్వారా మహిళల కాంపౌండ్ ఆర్చరీలో మెడల్ గెలిచిన తొలి భారత క్రీడాకారిణిగా రికార్డులకెక్కింది. ఉత్కంఠ భరితం గా సాగిన మ్యాచ్‌లో జ్యోతి సురేఖ 150 145 స్కోరుతో ఎల్లా గిబ్సన్(గ్రేట్ బ్రిటన్)పై విజయం సాధించింది. వరల్డ్ కప్ ఫైనల్లో 150 పాయింట్లు నమోదవడం కూడా ఇదే తొలిసారి. అంతర్జాతీయ ఆర్చరీలో ఎన్నో రికార్డులు నెలకొల్పిన జ్యోతి సురేఖ కు ఇది 88వ మెడల్.