calender_icon.png 2 September, 2025 | 1:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిపిఎస్ రద్దుకై హైదరాబాద్ కు తరలిన తపస్ నాయకులు

01-09-2025 11:39:44 PM

చేగుంట,(విజయక్రాంతి): టీజీఈ జెఎసి ఆధ్వర్యంలో సిపిఎస్ విధానాన్ని రద్దుచేసి, ఒపీఎస్ విధానాన్ని అమలు చేయాలని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన పాత పెన్షన్ విధాన సాధనకై ఆత్మగౌరవ సభకు హాజరైన మెదక్ జిల్లా తపస్ నాయకులు. తపస్ మెదక్  జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం, చల్లా లక్ష్మణ్, ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ... కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు,మేము అధికారంలోకి వస్తే సిపిఎస్ విధానం రద్దుచేసి,ఒపీఎస్ విధానం అమలు చేస్తామని వాగ్దానం చేశారని, వారి హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని వారు అన్నారు.