calender_icon.png 2 September, 2025 | 9:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మత్స్యకారుల కుటుంబాలను ఆదుకోవాలి

02-09-2025 12:00:00 AM

సీపీఎం ఆధ్వర్యంలో ఐటీడీఏ పీవోకు వినతి

భద్రాచలం, సెప్టెంబర్ 1 (విజయ క్రాంతి): గోదావరి వరదల కారణంగా  ఉపాధి కోల్పోతున్న మత్స్యకారుల కుటుంబాలను ఆదుకోవాలని సిపిఎం భద్రాచలం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఐటీడీఏ పీవో కు వినతి పత్రం అందించడం జరిగింది. భద్రాచలం పట్టణం కంబాలపాడు ప్రాంతంలో నివాసం ఉంటున్న మత్స్యకారులు చేపల వేటే జీవనాధారంగా జీవిస్తున్నారని గత మూడు నెలలుగా గోదావరి వరదలు కారణంగా చేపల వేట సాధ్యం కాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం బి నర్సారెడ్డి అన్నారు.

మత్స్యకారుల కుటుంబాలలోని మగవారు చేపల వేటకు వెళ్లిన మహిళలు గోదారి ఒడ్డున చిన్న చిన్న షాపులు పెట్టుకొని కొబ్బరికాయలు హారతి దీపాలు ఇతర పూజా సామాగ్రి అమ్ముకొని జీవనం సాగిస్తున్నారని అన్నారు. గత మూడు నెలలుగా గోదావరి వరదలు రావడంతో గోదావరి ఒడ్డున చిరు వ్యాపారం చేసుకుంటున్న మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వారి షాపులు ముంపు గురవుతూ ఉండడంతో తరచూ షాపులను ఒడ్డుకు తీసుకొని వెళ్లి  వరదలు తగ్గిన తర్వాత తిరిగి షాపులు వడ్డు క్రింద పెట్టుకొని అమ్ముకోవడం జరుగుతుందని, వరదలు రావడంతో వ్యాపారాలు లేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు.

ఒకపక్క చేపల వేట లేక, మరోపక్క,వ్యాపారాలు నడవక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న మత్స్యకారుల కుటుంబాలను ఆర్థికంగా ఆదుకోవాలని, మత్స్యకారుల కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కారం పుల్లయ్య పట్టణ కార్యదర్శి గడ్డం స్వామి జిల్లా కమిటీ సభ్యులు మర్మం చంద్రయ్య మత్స్యకారుల కుటుంబాలు శ్రీను రమణ గంగా స్వరూప సుధా కుమారి తదితరులు పాల్గొన్నారు.