calender_icon.png 2 August, 2025 | 7:33 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్మీ ‘శివ’ తాండవం

02-08-2025 12:00:00 AM

  1. ఆపరేషన్ మహదేవ్ ముగియగానే ఆపరేషన్ శివశక్తితో విరుచుపడుతున్న సైన్యం 
  2. టెర్రరిస్టులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న భారత బలగాలు 
  3. వంద రోజుల్లో 12 మంది ఉగ్రవాదులు హతం.. అందులో ఆరుగురు పాకిస్థాన్ ముష్కరులు

న్యూఢిల్లీ, ఆగస్టు 1: పహల్గాం ఉగ్రదాడి అనంతరం మన బలగాలు ఉగ్రవాదులను చీల్చి చెండాడుతున్నాయి. పహల్గాం ఉగ్రదాడి అనంతరం వరుస ఆపరేషన్లు చేపడు తూ.. ఉగ్రవాదులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే వివిధ ఆపరేషన్లలో 12 మంది ఉగ్రవాదులను మట్టుబె ట్టాయి. వీరిలో ఆరుగురు  పాకిస్థానీ ఉగ్రవాదులు.

మరణించగా.. మిగతా ఆరుగురు ఉగ్రవాదులకు కూడా జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఉగ్రదాడులతో సంబంధం ఉంది. పహ ల్గాం ఉగ్రదాడి అనంతరం ఆపరేషన్ సిం దూర్‌తో పాక్ ఉగ్రవాదుల వెన్నువిరిచిన ఆర్మీ.. తర్వాత అనేక ఆపరేషన్లు చేపట్టింది. ఈ ఆపరేషన్ల ద్వారా పహల్గాం ఘటనకు కారణమైన ఉగ్రవాదుల్లో కొందరిని మట్టుబెట్టినట్టు కేంద్రం ప్రకటించింది. ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా చేపట్టిన చర్యలతో 100 మందికి పైగా ఉగ్రవాదులు ప్రాణాలు కోల్పోయారు. 

మహదేవ్‌తో ముచ్చెమటలు..

ఆపరేషన్ సిందూర్ అనంతరం ఆర్మీ ‘ఆపరేషన్ మహదేవ్’ను లాంచ్ చేసింది. పహల్గాం ఉగ్రదాడితో సంబంధం ఉన్న ముగ్గు రు ఉగ్రవాదులను ఈ ఆపరేషన్ ద్వారా మ ట్టుబెట్టారు. జూలై 28న లష్కరే తాయిబాకు చెందిన సులేమాన్, అఫ్ఘన్, జిబ్రాన్ మొదలైన ఉగ్రవాదులు మరణించారు. ఆర్మీ, సీఆర్‌పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులు కలిసి ఈ ఆపరేషన్‌ను నిర్వహించారు. ఇక ఈ ఆపరేషన్ అనంతరం ‘ఆపరేషన్ శివశక్తి’ ద్వారా ఆర్మీ ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టింది. 

మరో 42 ఉగ్రవాద స్థావరాలు

పహల్గాం ఘటనకు ముందు 42 ఉగ్రవాద స్థావరాలు ఉండగా.. వాటి ల్లో 110 నుంచి 130 మంది ఉగ్రవాదులు ఉన్నారని నిఘా వర్గాలు వెల్ల డించాయి. వీటిల్లో ఎక్కువ భాగం పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) పరిధిలోనే ఉండేవి. కానీ మన ఆర్మీ ఆపరేషన్ సిందూర్ ద్వారా 100 మందికి పైగా ఉగ్రవాదులను మట్టుబెట్టింది. జమ్ము, రాజౌరీ, పూంచ్‌ల లో 60 నుంచి 65 మంది ఉగ్రవాదు ల కదలికలను గుర్తించినట్టు భద్రతా బలగాలు తెలిపాయి.