calender_icon.png 22 October, 2025 | 10:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ దాడి

22-10-2025 12:00:00 AM

8 మంది పేకాటరాయుళ్ల అరెస్ట్ 

చేగుంట, అక్టోబర్ 21 : విశ్వసనీయమైన సమాచారం మేరకు చేగుంట బస్టాండ్ పరిధిలో పేకాట ఆడుతున్న వ్యక్తులపై మెదక్ జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి అరెస్టు చేశారు. ఈ దాడిలో మొత్తం 8 మంది పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకుని, వారి వద్ద రూ.58,060 నగదు, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని, నిందితులను, స్వాధీనం చేసిన వస్తువులను చేగుంట పోలీస్ స్టేషన్ లో అప్పగించి కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

55 మంది అరెస్టు ..

జహీరాబాద్ టౌన్, అక్టోబర్ 21 : జహీరాబాద్ పట్టణంలో పేకాట ఆడుతున్న 55 మందిని అరెస్ట్ చేసినట్లు జహీరాబాద్ పట్టణ ఎస్త్స్ర వినయ్ కుమార్ తెలిపారు. జహీరాబాద్ పట్టణంలోని బాగారెడ్డిపల్లి, చెన్నారెడ్డి నగర్, పోచమ్మ టెంపుల్, అల్లిపూర్, మాణిక్ ప్రభు మహిళా, ఆర్య నగర్ లలో పేకాటరాయుళ్ళను పట్టుకున్నామని ఆయన తెలిపారు. 8 స్థావరాలలో పేకాట ఆడుతున్న 55 మంది వద్ద ఒక్కొక్క స్థావ రంలో 52 పేకాట ముక్కలు, అందరి వద్ద కల్పి రూ.8,550 దొరికాయని ఆయన తెలిపారు. 

జహీరాబాద్ మండలంలోని పేకాట స్థావరంపై దాడి చేసి పేకాట ఆడుతున్న వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు జహీరాబాద్ రూరల్ ఎస్ ఐ కాశీనాథ్ తెలిపారు. మంగళవారం రంజోల్ బాబా నగర్, శిల్పా వెంచర్ లలో పేకాట ఆడుతున్న 13 మందిని అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. వారి వద్ద నుండి రూ.12,450 నగదుతో పాటు 52 పేకాట ముక్కలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎవరైనా పేకాట ఆడిన చెట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వారిపై చట్టరీత్యా చర్య తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

పేకాట ఆడిన 469 మందిపై కేసులు 

ఎస్పీ రాజేష్ చంద్ర

కామారెడ్డి, అక్టోబర్ 21 (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా జూదం ఆడుతున్న వారిపై పోలీసు లు దాడులు నిర్వహించారు. వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన ఈ దాడుల్లో మొత్తం 82 కేసులు నమో దు చేసి 469 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు.వారి వద్ద నుండి పోలీసులు రూ.10,40,089/- నగ దు, 321 మొబైల్ ఫోన్లు, 45 మోటా ర్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.

మంగళవారం జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, మాట్లాడుతూ పేకాట వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు వ్యక్తి, కుటుంబం, సమాజానికి ఘోరమైన హాని కలిగిస్తాయన్నారు. ఇవి వ్యక్తులను అప్పుల్లో నింపి ఆర్థిక విధ్వంసానికి గురి చేస్తాయి. కుటుంబాల్లో ఘర్షణలు, నిరాశ, అనాథత్వ భావనలు ఏర్పడతాయి, దారుణ పరిణామాలైన ఆత్మహత్యల వరకూ దారితీయవచ్చన్నారు. ఆత్మీయుల భావోద్వేగం, పిల్లల భవిష్యత్తు ఇవ న్నీ జూదం వల్ల ప్రమాదంలో పడతాయి అని ఎస్పీ తెలిపారు.

జూదం ఇతర చట్టవ్యతిరేక కార్యక్రమాలను నిరోధించడం అందరి సామాజిక బాధ్యత అన్నారు. కుటుంబ శ్రేయ స్సు, సమాజ భద్రత కోసం ఇటువంటి కార్యకలాపాల నుండి పూర్తిగా దూరంగా ఉండాలని అన్నారు, జిల్లా ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు.

అలాగే గ్రామాలు, పట్ట ణాలు, ఫామ్ హౌస్లు, ఇళ్లు, బహిరంగ ప్రదేశాల్లో జూదం (పేకాట) లేదా ఇతర చట్టవ్యతిరేక కార్యక్రమా లు ఎవరైనా నిర్వహిస్తున్నట్లు తెలిసినా లేదా ఎవరు ఇలాంటి కార్య క్రమాలకు పాల్పడుతున్నట్లు సమాచారం ఉన్నా, వెంటనే పోలీస్ కం ట్రోల్ రూమ్ నంబర్ 87126 86133, 100 డయల్ చేయాలన్నారు. సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారుల కు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. సమాచా రం అందించిన వారి పేర్లు గోప్యంగా ఉంచ నున్నట్లు తెలిపారు.

తాడ్వాయిలో..

తాడ్వాయి, అక్టోబర్ 21(విజయ క్రాంతి) : కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం చిట్యాల, సంతాయిపేట గ్రామాలలో పేకాట ఆడుతున్న పేకాటరాయుళ్లను సోమవారం పట్టు కుని అరెస్టు చేసినట్లు తాడువాయి ఎస్త్స్ర నరేష్ తెలిపారు.చిట్యాలలో ఐదుగురు,సంతాయిపేటలో నలుగు రు పేకాట ఆడుతుండగా పక్కా సమాచారంతో వారిని పట్టుకున్నట్లు ఆయన తెలిపారు. వీరి వద్ద చిట్యాల లో నుంచి రూ. 17800 నగదు, సం తాయి పేటలో రూ. 1110 నగదు, ఆరు సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. ఈ విషయమై 9 మంది పై కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్త్స్ర తెలిపారు. మండలంలో ఎవరైనా పేకాట ఆడుతున్నట్లయితే సమాచారం అందించాలని ఎస్త్స్ర కోరారు.

ఎల్లారెడ్డిలో..

ఎల్లారెడ్డి అక్టోబర్ 21 (విజయక్రాంతి): దీపావళి పండుగ సంద ర్భంగా పలువురు జూదగాల్లు ఎల్లారెడ్డి పట్టణం పరిసర గ్రామీణ ప్రాం తాలలో పేకాట ఆడుతున్నారని ప్ర త్యేక సమాచారం అందుకున్న ఎల్లారెడ్డి ఎస్‌ఐ మహేష్ ఎల్లారెడ్డి పోలీ సులతో ప్రత్యేక దాడులు నిర్వహించి జూదగాలను ఎట్టకేలకు పట్టుకున్నా రు. ఎల్లారెడ్డి మండలంలోని ఎల్లారెడ్డి లింగారెడ్డిపేట మల్కాపూర్ కళ్యాణి వెల్లుట్ల పేట మౌలాన్ కేట్ మరియు సాతల్లి గ్రామాల చెందిన పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు.