calender_icon.png 5 August, 2025 | 8:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ టీం మెరుపుదాడి

05-08-2025 12:00:00 AM

నిజామాబాద్ ఆగస్టు 4 (విజయ క్రాంతి) : నిజామాబాద్ పోలీస్ కమీషనర్ .సాయి చైతన్య, ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ ఏసీపీ నాగేంద్ర చారి ఆధ్వర్యంలో  టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అంజయ్య ఎస్త్స్ర శివరామ్ సిబ్బంది దాడులు జరిపారు. సోమవారం ఏర్గట్ల పోలీస్ స్టేషన్  పరిధిలోని బట్టపూర్ గ్రామ శివారులో గల  ఫార్మ్ హౌస్ నందు  పేకాట   స్థావరం పై రైడ్ చేసి 8మంది పేకాట రాయుళ్ళు మరియు 8 సెల్ ఫోన్స్, నగదు రూ : 69710 స్వాధీనం చేసుకొని తదుపరి చర్య నిమిత్తం ఏర్గట్ల ఎస్హెచ్‌ఓ కు అప్పగించారు.