08-08-2025 04:56:31 PM
లక్షెట్టిపేట (విజయక్రాంతి): మండలంలోని ఊత్కూర్, ఇటిక్యాలలో శుక్రవారం జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్(District Collector Kumar Deepak), జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఆదేశాల మేరకు టీబీ ముక్త్ భారత్ అభియాన్ ను ప్రారంభించారు. ఈ వైద్య శిభిరంలో 60 మందికి లక్షెట్టిపేట సివిల్ ఆసుపత్రికి 102 వాహనాల్లో తీసుకెళ్ళి ఎక్స్ రే తెమడ పరీక్షలు చేశారు. మరో 50 మందికి సాధారణ పరీక్షలు నిర్వహించి వారికి మందులను అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకట్రావుపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డాక్టర్ సతీష్ కుమార్, ఆర్ బీఎస్కే వైద్యులు డాక్టర్ శరత్ బాబు, డాక్టర్ శోభ , టీబీ జిల్లా కో ఆర్డినేటర్ సురేందర్, జిల్లా ఎన్సీడి డిపీసి లక్ష్మణ స్వామి ,సూపర్ వైజర్లు సురేష్, శోభ, మార్త, ఎంఎల్ హెచ్ పి మౌనిక,హెల్త్ అసిస్టెంట్లు గఫూర్,ఇసాక్ అహ్మద్, ఏఎన్ఎం విజయదర్షిని, చిలకమ్మ, ఆశావర్కర్స్ పాల్గొన్నారు.