calender_icon.png 8 August, 2025 | 8:00 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాజరాజేశ్వరి మాత తొమ్మిదవ ఆలయ వార్షికోత్సవం

08-08-2025 04:54:38 PM

హాజరైన ఎమ్మెల్యేకు సన్మానం..

సదర్ సంఘము ఆధ్వర్యంలో కలశాల ఊరేగింపు..

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వీక్లీ మార్కెట్లో నెలకొల్పిన రాజరాజేశ్వరి మాత ఆలయ తొమ్మిదవ వార్షికోత్సవం శుక్రవారం ఘనంగా నిర్వహించారు. మున్నూరు కాపు సదర్ సంఘం ఆధ్వర్యంలో కలశాల ఊరేగింపు నిర్వహించారు. మున్నూరు కాపు సదర్ సంఘ సభ్యులు, ప్రతినిధులు ప్రతి ఇంటి నుంచి కలశాలను ఊరేగింపుగా రాజరాజేశ్వరమ్మ ఆలయం వరకు తీసుకువచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమానికి కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి(MLA Katipally Venkataramana Reddy) హాజరయ్యారు. సదర సంఘం ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డిని జ్ఞాపికతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు ఆకుల శ్రీనివాసరావు, ప్రతినిధులు తిరుపతి, ముదాం శ్రీనివాస్, మట్టి మల్ల లింగం, రవి, రమేష్, వెంకన్న, రాజు, లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.