calender_icon.png 8 August, 2025 | 10:14 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పర్యావరణ పరిరక్షణతోనే మానవాళి మనుగడ

08-08-2025 07:07:51 PM

జిల్లా జాయింట్ కలెక్టర్ చంద్రయ్య..

మందమర్రి (విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణతోనే మానవాళి మనుగడ ఆధారపడి ఉందని, దీనిని దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య(District Additional Collector Chandraiah) కోరారు. మండలంలోని వెంకటాపూర్ గ్రామపంచాయతీలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటి ఆయన మాట్లాడారు. గ్రామంలోని ప్రతి ఒక్కరు తమ ఇంటి ఆవరణలో రెండు మొక్కలు నాటి వాటిని సంరక్షించి వాతావరణం కాలుష్యం కాకుండా కాపాడాలన్నారు. గ్రామంలో పారిశుద్ధ చర్యలు మెరుగు పరచాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని ఇంటి పరిసరాలలో వర్షం నీరు, మురుగు నీరు నిలువ లేకుండా చూడాలని గ్రామస్థులకు సూచించారు. అనంతరం గ్రామంలోని వర్మి కంపోస్ట్ షెడ్డు, నర్సరీని సందర్శించారు.

ఈ సందర్భంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో సేకరించిన తడి చెత్త, పొడి చెత్త వేరు చేసి డంపింగ్ యార్డ్ కు తరలించి వర్మీ కంపోస్టు ఎరువుల తయారీ చేయడాన్ని పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. నర్సరీని సందర్శించి నర్సరీలలో మొక్కల పెంపకం తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా వర్మి కంపోస్ట్ ఎరువులను తయారు చేస్తూ, పారిశుద్ధం మెరుగు పరిచి మొక్కల పెంపకానికి కృషి చేస్తున పంచాయతీ కార్యదర్శిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిఆర్డిఓ ఎస్ కిషన్, ఎంపీడీవో ఎన్ రాజేశ్వర్, ఏపీవో రజియా సుల్తానా, ఏపిఎం చంద్రశేఖర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి కొండ్రు ప్రశాంత్, ఈసి మధు,  సిసి చారి, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం జిల్లా గౌరవఅధ్యక్షులు ఈద లింగయ్య, గ్రామస్తులు పాల్గొన్నారు.