12-05-2025 05:56:09 PM
భద్రాచలం,(విజయక్రాంతి): తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలలో ప్రథమ సంవత్సరమునకు విద్యార్థినీ విద్యార్థులకు స్పాట్ కౌన్సిలింగ్ ప్రవేశము నిర్వహించనున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025-26 విద్యా సంవత్సరానికి గాను భద్రాద్రి కొత్తగూడెం మరియు ఖమ్మం జిల్లాలలోని గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలలో మొదటి సంవత్సరంలో(Jr.Inter) సీట్ల భర్తీ కొరకు స్పాట్ కౌన్సిలింగ్ బాలికలకు మరియు బాలురకు వేరువేరుగా నిర్వహించునట్లు ఆయన అన్నారు.
కావున ఆసక్తి గల విధ్యార్దినీ విద్యార్థులు మరియు ఇటీవలే పదవ తరగతి (2024-25 విద్యా సంవత్సరం) పూర్తయిన అభ్యర్థులు తప్పకుండ తమ ఒరిజినల్ సర్టిపికెట్లతో తేది: 15-05-2025. న ఉదయం 9.00 గంటలకు బాలికలకు మరియు బాలురకు తేది:16-05-2025 న ఉదయం 9.00 గంటలకు స్పాట్ కౌన్సెల్లింగ్ గిరిజన గురుకుల పాఠశాల/ కళాశాల(బాలికలు), భద్రాచలం వద్ద స్పాట్ అడ్మిషన్ ప్రక్రియకు హాజరు కాగలరని కోరుచూ, ఈ సదావకాశాన్ని విద్యార్థినీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, మరిన్ని వివరాల కొరకు 9490957271. 9490957270 ఫోన్ నెంబర్లను సంప్రదించి తెలుసుకోవాలని ఆయన అన్నారు.