51 శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ అమలు చేయాలి
తహసీల్దార్‌కు ఉపాధ్యాయ జేఏసీ వినతి
రేవల్లి, ఏప్రిల్ 17: ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని కోరుతూ టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం రేవల్లి తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. అనంతరం తహసీల్దార్ సరస్వతికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసనను వ్యక్తం చేశారు. ఉపాధ్యాయులు మాట్లాడుతూ.. 51 శాతం ఫిట్మెంట్తో కొత్త పీఆర్సీని జూన్ 2వ తేదీలోపు అమలు చేయాలని, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న బిల్లులను రెండు విడతల్లో వెంటనే చెల్లించాలన్నారు.
దీంతో పాటు మే 1వ తేదీ నుంచి నగదు రహిత వైద్యం కోసం హెల్త్ కార్డులను పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేవాలని, ప్రస్తుత సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులతో సహా ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలి కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు గోపాల్, చంద్రకాంత్, శ్రీశైలం, సతీష్, మధుకర్, రాము, ఫయాజ్, మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.






