21-11-2025 12:00:00 AM
టీఎస్ టీసీఈఎ అధ్యక్షుడు ఆయనేని సంతోష్ కుమార్ జేఎన్‌టీయూహెచ్ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్ రావుకు వినతి
ముషీరాబాద్, నవంబర్ 20 (విజయక్రాంతి) : నిబంధనల ప్రకారం అధ్యాప కులకు ఇవ్వాల్సిన సర్టిఫికిట్స్, జీతం ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని జెఎన్ టియుహెచ్ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్ రావును గురువారం కలసి విజ్ఞప్తి చేసినట్లు తెలంగాణ స్కూల్స్, టెక్నీకల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ (టీఎస్ టీసీఈఎ) అధ్యక్షుడు ఆయినేని సంతోష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఇందుకు రిజిస్ట్రార్ సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. అధ్యాపకు లకు మేలు జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఇదే సమయంలో అధ్యాపకుల వయస్సు 60 ఏళ్ల నుంచి 65 ఏండ్లకు పొడిగించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరినట్లు చెప్పారు. ప్రధానంగా కొన్ని కళాశాలలో జీతాలు చెల్లించడం లేదని అన్నారు.
అందులో భాగంగా మహావీర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ లో అధ్యాపకులకు సరియైన జీతాలు చెల్లించడం లేదన్నారు. అధ్యాపకులు మూడు నెలల ముందస్తు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందన్నారు.
సర్టిఫికెట్స్ పెట్టుకోవడం ఒక నేరం అని, అది పెట్టుకొని ఇవ్వకుండా అధ్యాపకులను ఇబ్బందిపెట్టే విధంగా చూస్తున్నారని అన్నారు. నిబంధనల ప్రకారంగా జీతాలు చెల్లించడం లేదని వారు వాపోతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో నరేష్, ఇతర అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.