calender_icon.png 29 August, 2025 | 1:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే

28-08-2025 10:55:22 PM

ముంపు ప్రాంతాలను పరిశీలించిన సీఎం..

కామారెడ్డి, ఎల్లారెడ్డి, నిజాంసాగర్ మండలాల్లో పరిశీలన

కామారెడ్డి (విజయక్రాంతి): రాష్ట్రంలో గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కామారెడ్డి జిల్లాలో వరద కారణంగా ఆపారమైన నష్టం వాటిల్లింది. గురువారం మధ్యాహ్నం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ప్రత్యక్షంగా ముంపు  ప్రాంతాలను పరిశీలించేందుకు ఏరియల్ సర్వే నిర్వహించారు. హైదరాబాద్ నుండి ప్రత్యేక హెలికాప్టర్లో మెదక్ తో పాటు కామారెడ్డి, ఎల్లారెడ్డి, నిజాంసాగర్లో ముంపు  ప్రాంతాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వీక్షించారు. పోచారం ప్రాజెక్టు, నిజాంసాగర్ ప్రాజెక్టులను వీక్షించినానంతరం మెదక్ వెళ్లారు.