calender_icon.png 29 August, 2025 | 1:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రెస్ ఫోటోగ్రాఫర్ ను రెస్క్యూ చేసిన వన్ టౌన్ సీఐ వాసుదేవరావు

28-08-2025 10:47:49 PM

సిద్దిపేట (విజయక్రాంతి): భారీ వర్షాలకు సిద్దిపేట పట్టణం జలమయం అవడంతో విధి నిర్వహణలో భాగంగా ఇద్దరు పత్రిక ఫోటోగ్రాఫర్లు ఓ బహులా అంతస్తుల బంగ్లా లిఫ్ట్ ద్వారా పైకి వెళ్లారు. కానీ మధ్యలోనే కరెంటు పోవడంతో ఇద్దరూ అయోమయానికి గురయ్యారు. శ్రీనగర్ కాలనీలో వరదల్లో చిక్కుకున్న స్థానికులను రక్షించడానికి వచ్చిన బీఆర్ఎస్ నాయకులు బాబు జానీ, గ్యాదరి రవి లకు సమాచారం ఇవ్వగా వాళ్ళు వెంటనే వన్ టౌన్ సిఐ వాసుదేవరావు(CI Vasudeva Rao)కి సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన సిఐ హుటాహుటిన తన సిబ్బందితో భవనం వద్ద చేరుకొని బంగ్లా వాచ్మెన్ కు జరిగిన విషయం చెప్పి జనరేటర్ ఆన్ చేయించి ఇద్దరినీ క్షేమంగా కిందికి తీసుకువచ్చారు. దీంతో ఫోటోగ్రాఫర్లు ఇద్దరు సిఐ వాసుదేవరావుకి, బీఆర్ఎస్ నాయకులు బాబు జానీ, గ్యాదరి రవిలకు కృతజ్ఞతలు తెలిపారు.