28-08-2025 10:51:07 PM
కొమురవెల్లి: ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయం(Komuravelli Mallikarjuna Swamy Temple)లో నిర్వహించిన వేలం పాటలో రూ. కోటి రూపాయలు ఆదాయం సమకూరింది. తలనీలాలకు సంబంధించిన వేలం పాటను ఆలయ అధికారులు గురువారం నిర్వహించారు. ఈ వేలం పాటలో రుద్ర ఎంటర్ప్రైజెస్ వారు 1,01,01,116=00 హెచ్చు పాట పాడి టెండర్లను దక్కించుకున్నారు. గతంలో కంటే 38 లక్షల 68 వేల 116 రూపాయలు అధికం. ఈ వేలం పాటలో ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎస్ అన్నపూర్ణ, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ పి విజయలక్ష్మి, ఏఈఓ బుద్ధి శ్రీనివాస్, పాలకమండలి సభ్యులు లింగంపల్లి శ్రీనివాస్, అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.