28-08-2025 10:43:08 PM
కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లాలో ఫైర్ సర్వీస్ డైరెక్టర్ జనరల్ నాగిరెడ్డి(Fire Service Director General Nagireddy) సందర్శించారు. గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు కామారెడ్డి జిల్లా కేంద్రం వరద నీరుతో అతలాకుతలమైన ప్రాంతాలను పరిశీలించారు. కామారెడ్డిలోని సారంపల్లి రోడ్, జి ఆర్ కాలనీ, కౌండిన్య హౌసెస్, హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఇండ్లను పరిశీలించారు. రెస్క్ ఆపరేషన్ నిర్వహించిన సిబ్బందిని ఫైర్ శాఖ డిజి నాగిరెడ్డి అభినందించారు.