calender_icon.png 16 September, 2025 | 9:01 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉపాధ్యాయ వృత్తి పవిత్రమైనది

16-09-2025 06:51:31 PM

నకిరేకల్ (విజయక్రాంతి): భవిష్యత్తు తరాలను నిర్మించే ఉపాధ్యాయ వృత్తి అత్యంత పవిత్రమైనదని పామనగుండ్ల గెజిటెడ్ హెడ్మాస్టర్ మైనం శ్రీలత అన్నారు. ఇటీవల పాఠశాలకు చెందిన తెలుగు ఉపాధ్యాయులు చింతల సుధీర్ కుమార్ జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులుగా, ఆంగ్ల ఉపాధ్యాయులు సింగనబోయిన పండరి మండలం ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎన్నికైన సందర్భంగా మంగళవారం పాఠశాలలో నిర్వహించిన అభినందన సభలో ఆమె మాట్లాడారు. అవార్డులు బాధ్యత పెంచుతాయన్నారు. మరింత ఉత్సాహంతో విద్యార్థులను తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు విశ్వనాథుల రాఘవాచారి బెల్లి ఆంజనేయులు, తాడిశెట్టి శ్రీనివాసులు, అలీం ఆలం, గోరంట్ల విజయరాణి, బజ్జూరు మంగమ్మ తదితరులు పాల్గొన్నారు.