calender_icon.png 6 November, 2025 | 9:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యస్. జి. యఫ్. రాష్ట్ర స్థాయి, హ్యాండ్ బాల్ ఛాంపియన్ షిప్ పోటీలకు పారమిత విద్యార్థి

06-11-2025 07:06:28 PM

కొత్తపల్లి (విజయక్రాంతి): నగరంలోని పద్మనగర్ పారమిత హెరిటేజ్ పాఠశాల విద్యార్థి  సి. హెచ్  భువన రెడ్డి  యస్. జి. యఫ్. రాష్ట్ర స్థాయి హ్యండ్ బాల్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల ప్రధానోపాద్యాయుడు గోపిక్రిష్ణ తెలిపారు. ఇటీవల సిరిసిల్ల జిల్లా కొత్తపేట గ్రామంలో జరిగిన ఉమ్మడి జిల్లా 69వ యస్. జి. యఫ్. అండర్ 17 బాల బాలికల హ్యండ్ బాల్ ఎంపిక పోటీలలో  సి. హెచ్ భువన రెడ్డి అత్యంత ప్రతిభను కనబర్చి ఈనెల 7 నుంచి 9 వరకు మహబూబ్నగర్ లో జరిగే రాష్ట్ర స్థాయి హ్యండ్ బాల్ పోటీలకు ఎంపిక అయిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని పారమిత విద్యాసంస్థల అధినేత డా. ఇ. ప్రసాదరావు, డైరెక్టర్స్ ప్రసూన, అనూకర్ రావు, రశ్మిత, వినోద్ రావు, వి.యు.యం.ప్రసాద్, హన్మంతరావు, ప్రధానోపాద్యాయుడు గోపిక్రిష్ణ, సమన్వయకర్త రబీంద్ర పాత్రో, వ్యాయామ ఉపాద్యాయులు రాజు, అమరేందర్ లు అభినందించారు.