calender_icon.png 6 November, 2025 | 9:16 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సైబర్ నేరాలపై అవగాహన

06-11-2025 07:03:58 PM

కాటారం (విజయక్రాంతి): సమాజంలో రోజురోజుకు పెరిగిపోతున్న సైబర్ క్రైమ్ నేరాలపై మహాదేవపూర్ పోలీసులు అవగాహన కార్యక్రమం చేపట్టారు. గురువారం సాయంత్రం మహాదేవపూర్ బస్ స్టేషన్ లో ప్రయాణికులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సైబర్ క్రైమ్ టీం కిషన్, శంకర్, స్వామి, రమాదేవి, సైబర్ క్రైమ్ గురించి వివరించారు. మొబైల్ ఫోన్లలో లింకులు పంపించి నేరాలకు పాల్పడే అవకాశాలను వారు సోదాహరణంగా వివరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఆదేశాల మేరకు మహాదేవపూర్ ఎస్సై కురిక్యాల పవన్ కుమార్ మార్గదర్శకం మేరకు పల్లె పల్లెల్లో ప్రజలకు సైబర్ క్రైమ్ నేరాలపై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

అనుమానిత ఫోన్ నెంబర్లను గుర్తించాలని పేర్కొన్నారు.  అనుమానిత వీడియో కాల్, వాట్సాప్ కాల్ లను నిలుపుదల చేసుకోవాలని సూచించారు. 1930 టోల్ ఫ్రీ నెంబర్ కు సైబర్ క్రైమ్ నేరాలపై తక్షణమే స్పందించాలని ప్రజలకు అవగాహన కల్పించారు. సెల్ ఫోన్ వినియోగాన్ని చిన్నపిల్లలకు ఇవ్వకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. అసభ్యకర సందేశాలు, వీడియోలు నిలువరింప చేసుకోవడానికి సెల్ ఫోన్ వినియోగం పట్ల ఖచ్చితమైన అవగాహన కలిగి ఉంచుకోవాలని సూచించారు. బ్యాంకుల నుంచి ఫోన్ చేసినట్లుగా సైబర్ క్రైమ్ నేరగాళ్లు సమాచారం కావాలని ఏటీఎం నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్, పిన్ నెంబర్, ఆధార్ నెంబర్ తదితర వివరాలను అడుగుతుంటారని, వాటిని నిశితంగా గమనించాలని అన్నారు. బ్యాంకు సిబ్బందికి సంబంధం లేకుండా సైబర్ నేరగాళ్లు చేసే కుట్రలను జాగ్రత్తగా గమనించాలని వివరించారు.