calender_icon.png 6 November, 2025 | 9:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీసీ సంఘం నాయకుడిని పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే..

06-11-2025 07:08:21 PM

తలమడుగు (విజయక్రాంతి): తలమడుగు మండల బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు మేకల రవికాంత్ యాదవ్ ను బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపూరావు  పరామర్శించారు. రవికాంత్ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే గురువారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే వెంట పలువురు నాయకులు ఉన్నారు.