17-11-2025 12:57:16 AM
-టీసీ,ఆధార్ లేదని నిరాకరించొద్దు
-జిల్లాల డీఈవోలు విద్యాశాఖ ఆదేశాలు
హైదరాబాద్, నవంబర్ 16 (విజయక్రాంతి): ఎటువంటి పత్రాలు లేకపోయినా రెగ్యులర్ లేదా డ్రాపౌట్ పిల్లలకు అడ్మిషన్లు నిరాకరించొద్దని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ నవీన్ నికోలస్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల డీఈవోలకు తాజాగా ఆదేశాలు జారీ చేశా రు. ఏ పిల్లవాడికీ అడ్మిషన్ నిరాకరించొద్దని, ఒక స్కూల్ నుంచి మరొక స్కూల్‌కు వెళ్లే పిల్లలకు పాఠశాల హెచ్‌ఎం లేదా ఇన్‌చార్జ్ వెంటనే టీసీలను జారీ చేయాలని సూచించారు.
ఒకవేళ టీసీ, ఆధార్ కార్డులు లేని పి ల్లలకు అడ్మిషన్లు కల్పించాలని ఆదేశించారు. విద్యాహక్కు చట్టం ప్రకారం వయ స్సు రుజువులేని కారణంగా ఏ పిల్లవాడికీ అడ్మిషన్ నిరాకరించొద్దని, అడ్మిషన్లు ఇవ్వాల్సిందేనని పేర్కొన్నారు. అడ్మిషన్ అయిన తర్వాత అవసరమైన సర్టిఫికెట్లు పొందడం లో పిల్లలకు సహాయం చేయడానికి ఒక సిబ్బందిని నా మినేట్ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సూచనలు కచ్చితంగా పాటించాలని, ఎవరైనా ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.