26-08-2025 01:34:16 AM
- భిన్న సంస్కృతులు.. విభిన్న పండగలు
- 9 రోజులు యువతులు నియమ నిష్ఠలతో పూజలు
- బంజారాల తీజ్ వేడుకపై ప్రత్యేక కథనం
అదిలాబాద్, ఆగస్టు 25 (విజయక్రాంతి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసి గిరిజనుల పండుగలు అందరికంటే భిన్నం గా ఉంటాయి. ప్రతి పండగను ఓ ప్రత్యేకత చాటే లా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. బంజారా, లంబాడీ సంస్కృతి సాంప్రదాయానికి చాటి చెప్పే పండుగలలో అతి ముఖ్యమై నది ఈ తీజ్ పండుగ ఒకటి.
తీజ్ అనగా గోదుమ మొలకలు అని అర్థం. ఈ పండుగను ముఖ్యంగా పెళ్ళి కాని అమ్మాయిలు శ్రావణ మాసములో భక్తి శ్రద్ధలతో తొమ్మిది రోజులు అత్యంత వైభవంగా జరుపుకుంటా రు. రాఖీ పౌర్ణమినీ పురస్కరించుకొని ఈ పండుగను ప్రారంభించి కృష్ణాష్టమి తర్వాత ఈ తీజ్ పండుగలను ముగిస్తారు. బతుకమ్మ పండగలాగే తొమ్మిది రో జుల పాటు బంజారా మహిళలు, యువతు లు ఉత్సాహంగా జరుపుకునే పండగనే తీజ్ పండగ.
తీజ్ ఉత్సవం ప్రత్యేకతలు
శివుడు లాంటి మంచి భర్త రావాలని పెళ్లికాని బంజారా యువతులు నియమ నిష్టల తో తొమ్మిది రోజులు పాటు సంప్రదాయ పూ జలు చేయడమే ఈ తీజ్ ఉత్సవాల ప్రత్యేకత. ఈ తీజ్ ఉత్సవాల్లో భాగంగా రాఖీ పౌర్ణమి రోజున ప్రారంభమయ్యే వేడుకల్లో బంజారా మహిళలు, యువతులు ఈ తీజ్ ఉత్సవాల్లో ఆనందోత్సవాల మధ్య పాల్గొంటారు. తమ సాంప్రదాయ వస్త్రలను ధరించి తీజ్ ఉత్సవం కోసం అవసరమయ్యే మట్టిని సమీప పంట పొలాల నుంచి సేకరించి ప్ర త్యేక పూజలు చేసి తీజ్ ఉత్సవాలకు శ్రీకారం చుడతారు.
తాండకు చెందిన పెద్దను నాయక్ అని పిలుస్తారు. నాయక్ ఆధ్వర్యంలో సమావేశమై తీజ్ పండుగ విశేషాలపై నిర్ణయాలు తీసుకుని నాయక్ అనుమతితో పనులను ప్రారంభిస్తా రు. అంగడికి వెళ్లి వెదురుతో తయారు చేసిన చిన్నచిన్న బుట్టలను తీసుకొని వస్తారు.
ఐతే ఒక ఇంటిలో ఎంతమంది పెళ్లికాని ఆడపిల్లలు ఉంటారో అన్ని వెదురు బుట్టలను తీసుకువచ్చి వాటికి అందంగా రంగు, రంగుల నూ లు దారాలతో, గవ్వలతో, ముత్యాలతో పూసలతో బాసింగాలు కట్టి పెళ్ళి కూతురులా అం దంగా ఆ బుట్టలను ముస్తాబు చేస్తారు. తా ము తీసుకొచ్చి న నల్ల మట్టిని ఆరబెట్టి శ్రావణ మాసములో వచ్చే రాఖీపూర్ణిమ రోజున సాయంత్రం తాండ నాయకుని ఇంటి ఆవరణలో అందరు సమావేశమై నాయక్ అనుమ తితో అందంగా అలంకరించిన వెదురు బుటల్లో ఈ నల్లని మట్టిని నింపి అందులో నాయక్ భార్య నాన బెట్టిన గోదుమలను చల్లడంతో ఈ ఉత్సవం ప్రారంభమౌతుంది.
9 రోజుల పాటు తాండలో పండగ వాతావరణం
ఈ పండుగను తొమ్మిది రోజులు ఘనం గా జరుపుకుంటారు. ప్రతి రోజూ పెళ్లి కానీ యువతులు తమ బంజారా సాంప్రదాయ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు. వెదురు బుట్టల్లోనే కాకుండా “మోదుగు” ఆకులతో గుల్లగా చేసి అందులో మట్టిని పోసి, గోదుమలని చల్లుతారు. పెళ్ళికాని ఆడ పిల్లలు ప్రతిరోజు మూడు పూటలు అందంగా ము స్తాబై వెదురు బుట్టల్లో ఉన్న గోదుమలకు నీల్లు చల్లుతారు.
అయితే ఈ కార్యక్రమంలో భాగంగా ఆడపిల్లలు “పులియాగెణో” (పూర్ణకుంభం) తలపై పెట్టుకొని బావి నీళ్లుకాని, బోరింగ్ నీళ్ళుకాని, చెరువు నీళ్లుకాని, తీసుకు వచ్చి తీజ్ కి పోస్తారు. ఈ కార్యక్రమం జరిగేటప్పుడు పెళ్ళికాని మగ పిల్లలు తీజ్ కి నీళ్లు పోయ్యనివ్వకుండా ఆపి, యువతులకు కొన్ని పొడుపు కథలు వేస్తారు.
వాటికి సమాధానం చెప్పినవారికి తీజ్ కి నీళ్ళు పొయ్యనిస్తారు. ఈ విధంగా రోజుకు మూడు పూటల పాటలు పా డుతూ, నృత్యాలు చేస్తూ నీళ్ళు జల్లుతూ అగ రు బత్తులతో దూపం చేస్తూ నైవేద్యం పెడు తూ ఉత్సాహంగా ఈ పండుగను జరుపుకుంటారు. దింతో తొమ్మిది రోజు పాటు తండా ల్లో పండగ వాతావరణం నెలకొంటుంది.
తీజ్ ఉత్సవంలో గణగోర్ పూజ..
తీజ్ నిమజ్జనం కంటే ఒక రోజు ముందు డంబోళి పండుగను జరుపుకుంటారు. ఆ రోజు పెళ్ళి కాని యువతులు కొత్త బట్టలు ధరించుకొని నాన బెట్టిన సెనగలను తీసుకొని పొలాలకు వెళ్ళి నేరేడు చెట్టుకు సెనగలను గుచ్చుతారు. అప్పుడు ఆడ పిల్లలు తమతో తెచ్చుకున్న పండ్లు, ఫలహారాలతో ఉపవాసాన్ని విరమిస్తారు.
అక్కడి నుండి నల్లని బంక మట్టిని తీసుకొని నాయక్ ఇంటికి తీసుకువెళ్ళి ఆ మట్టితో డోక్రీ, డోక్ర (ఆడ, మగ) బొమ్మలను ఒక పీటపై తయారు చేస్తారు. దీన్ని గణగోర్ అంటారు. తయారు చేసిన మట్టి బొమ్మలపై రైక బట్ట, తువ్వాల కప్పుతారు.”డంబోళి” రోజు రాత్రి తాండ వాసులంతా బోజనం చేసిన తర్వాత గోదుమ పిండితో తయారు చేసిన గోదుమ రోట్టె, బెల్లం, నెయ్యితో కలిపి ఉండలు తయారుచేస్తారు. దానిని చుర్మో అంటారు.
తయారు చేసిన చుర్మోను హారితి పెళ్ళెంలో వేసి అగరుబత్తులు కొబ్బరికాయ కుంకుమ, నీళ్ళు తీసుకొని స్త్రీ పురుషులందరు పెళ్ళికాబోయే ఆడపిల్లలతో తాండ నాయక్ ఇంట్లో డోక్రి, డోక్రా కు పూజలు చేసి డంబోళి పైన పాటలు పాడుతు నృత్యాలు చేస్తారు. మరుసటి రోజు ఉదయాన్నే ఆడ పిల్లలందరు డోక్రి, డోక్రాను నెత్తి మీద పెట్టుకొని ఊరి బయట ఉన్న చెరువులో గణగోర్ ని నిమజ్జనం చేసి తిరిగి ఇంటికి వచ్చి స్నానం చేసి కొత్త బట్టలు ధరించి ఆడపిల్లలందరు నాయక్ ఇంటి ఆవరణలో ఉన్న తీజ్ గుల్లలను మధ్యలో పెట్టుకొని పాటలు పాడుతూ నృత్యాలు చేస్తారు.
నిమజ్జనం రోజు ప్రత్యేక కార్యక్రమాలు
తొమ్మిది రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజించిన తీజ్ లను వాగులో నిమజ్జనం చేసే రోజున ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. గ్రామ ప్రజలు, నాయక్, కార్బారి, ఢావ్, ఢవ్ గేర్యా మాన్కరి అందరూ వచ్చి బాలాజీ బండారో (సహపంక్తి భోజనం) చేస్తారు. అనంతరం యువతులు తమ తీజ్ గుల్లలను నెత్తి మీద పెట్టుకొని నృత్యాలు చేస్తారు.
యువతుల వదినలు ఆ గుల్లను లాక్కొని వారి అమ్మ లకు ఇస్తారు. అమ్మ వాళ్ళందరూ పాటలు పాడుతూ నృత్యాలు చేస్తూ తీజ్ ని తెంపుతారు. తెంపిన తీజ్ ని యువతులు గ్రామ పెద్దలకు ఇస్తూ కాళ్ళు మొక్కుతు ఆశీర్వాదం పొందుదారు. గ్రామ పెద్దలు వారికి తోచిన విధంగా కానుకలు ఇస్తారు. తర్వాత యువతులంతా తీజ్ ని చేతుల్లో పట్టుకొని నృత్యం చేస్తుంటే వారి తల్లులు ఒక్కొక్కరు బుటల్లో డబ్బులు వేస్తారు. ఒక్కొక్కరు తీజ్ ని ఇచ్చిపుచ్చుకుంటారు.
ఆ తీజ్ ని మొక్కతూ పెళ్ళికాని వారు మెడలోని గొలుసుకు, పెళ్ళి అయిన వారు మంగళ సూత్రాలకి వాటిని కట్టుకుంటారు. అనంతరం అలంకరించి బండిలో తీజ్ ని ఉంచి బాజా బజంత్రీలతో తాండ అంతా ఊరేగించి పిల్లలు, పెద్దలు తాండ చెరువులో తీజ్ బుట్టలను నిమజ్జనం చేస్తారు.
ఆ సమయంలో ఆడ పిల్లలు బాదపడటం ఏడ్వటం చేస్తారు. ఎందుకంటే తొమ్మిది రోజులు ఉపవాస దీక్షతో, భక్తి శ్రద్ధ లతో, పాటలతో, నృత్యాలతో ఆనందంగా జరుపుకుంటారు. తీజ్ నిమజ్జనం అనంతరం యువతులకు వారి అన్నలు లేదా తమ్ముల్లు కాళ్ళు కడుగుతారు. అనంతరం సాయంత్రం వేళలో నాయక్ ఆధ్వర్యంలో గుడా లను అందరికి పంచి పండుగను ముగిస్తారు.