13-10-2025 05:04:23 PM
నిర్మల్ (విజయక్రాంతి): జిల్లాలో ప్రజలకు ఏ అవసరాలు వచ్చినా సమస్య ఉన్న పోలీసులకు వెంటనే ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. సోమవారం ఎస్పీ కార్యాలయంలో పోలీసుల ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల సమస్యలను ఓపికగా విన్నారు. కుటుంబ సమస్యలతో వచ్చిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించి భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ ఉపేందర్ రెడ్డి పోలీసులు పాల్గొన్నారు.