05-09-2025 01:29:26 AM
-‘ఏఐ’ ఆర్‌అండ్ డీ సెంటర్‌ను ఏర్పాటు చేయండి
-డీప్-టెక్, ఏఐ స్టార్టప్‌లలో పెట్టుబడులు పెట్టండి
-యూఏఈ ప్రభుత్వాన్ని కోరిన మంత్రి శ్రీధర్‌బాబు
హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): తెలంగాణను ‘గ్లోబల్ డిజిటల్, ఇన్నోవేషన్ హబ్’గా మార్చాలని తమ ప్రభుత్వం సంకల్పించిందని, ఈ లక్ష్య సాధనలో యూఏఈ భాగస్వామ్యం కావాలని ఐ టీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఆహ్వానించారు. యూఏఈ పర్యటనలో భాగంగా ఆ దేశ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఏఐ, డిజిటల్ ఎకానమీ అండ్ రిమోట్ వర్క్ అప్లికేషన్స్ ఓమర్ బిన్ సుల్తాన్ అల్ ఓలామాతో గురువారం ఆయన భేటీ అయ్యారు.
హైదరాబా ద్‌లో తెలంగాణ భాగస్వామ్యంతో ‘ఏఐ’ ఆర్‌అండ్ డీ సెంటర్‌ను ప్రారంభించేందుకు ముందుకు రావాలని ఆ హ్వానించారు. ‘తెలంగాణ భారతదేశంలో నాలుగో అతిపెద్ద యూఏఐ ఆర్థిక వ్యవస్థగా ఉందని, జూలై 2025 నాటికి ?1.26 లక్షల కోట్ల విలువైన లా వాదేవీలు జరిగాయని పేర్కొన్నారు. చెల్లింపులు, బ్లాక్‌చెయిన్, డిజిటల్ వాణిజ్యంలో కొత్త ఆవిష్కరణలకు ఫిన్‌టెక్ శాం డ్‌బాక్స్ అందుబాటులో ఉందని, ఈ నేపథ్యంలో యూఏఈ డిజిటల్ ఆర్థిక సంస్థలకు భారత్‌లో ప్రవేశ కేంద్రంగా హైదరా బాద్ అన్ని రకాలుగా అనుకూలంగా ఉం టుందని వివరించారు.
యూఏఐ కంపెనీలు నానో- జీసీసీలు, డిజిటల్ హబ్స్ ను ప్రారంభించేలా చొరవ చూపాలని కోరారు. ‘ఏఐ, స్టార్టప్ సమ్మిట్’ను యూఏఈతో కలిసి నిర్వహించేందుకు తెలంగాణ ఆసక్తిగా ఉందని, ఇందుకు సహకరించాలని కోరారు. స్మార్ట్ మొబిలిటీ, లాజిస్టిక్స్, గ్రీన్ ఎనర్జీ, గృహ నిర్మాణం, ఇ-గవర్నెన్స్ తదితర రంగాల్లో ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు యూఏఈ సంస్థలు మంచి అవకాశాలున్నాయని చెప్పారు.
గేమింగ్‌లో ‘తెలంగా ణఛూయూఏఈ ఫ్యూచర్ స్కిల్స్ అకాడమీ’ ఏర్పాటు చేసేందుకు ముందుకు రావాలని మంత్రి శ్రీధర్ బాబు యూఏఈ ప్రభుత్వాన్ని ఆహ్వానించారు. ఏఐ, డిజిటల్ ఎకానమీ, క్లౌడ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, గేమింగ్ తదితర రంగా ల్లో తెలంగాణతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఓమర్ బిన్ సుల్తాన్ అల్ ఓలామా అన్నారు.