calender_icon.png 5 September, 2025 | 4:25 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్‌లో ప్రొటోకాల్ రగడ

05-09-2025 01:31:49 AM

  1. వెలిచాలకు నిరసనగా ధర్నా

పార్టీ నుండి బహిష్కరించాలని డిమాండ్

మా దొర మంచోడంటూ పాలాభిషేకం

హీటెక్కిన రాజకీయం

కరీంనగర్, సెప్టెంబరు 4 (విజయ క్రాంతి): కరీంనగర్ లో ప్రోటోకాల్ రగడ తా రాస్థాయికి చేరుకుంది. ఇన్ని రోజులు అంతర్గతంగా ఉన్న వర్గ విబేధాలు బహిర్గతమ య్యాయి. ప్రస్తుతం కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జిగా ఉన్న వెలిచాల రాజేందర్ రావు తీరును నిరసిస్తూ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అందోళనకు దిగగా వెలిచాల వ ర్గం ఆయనకు మద్దతుగా కార్యక్రమాలు నిర్వహించడంతో కరీంనగర్ లో రాజకీయం మరింత వేడెక్కింది.

గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రాజేందర్రావు పేరుతో పలుచోట్ల భారీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఇందులో పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడైన మానకొండూర్ ఎమ్మె ల్యే కవ్వంపల్లి సత్యనారాయణల ఫోటోలు లేకపోవడంతో కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆందోళనకు దిగింది. దళితుల ఆత్మగౌర వాన్ని వెలిచాల రాజేందర్ రావు అవమానించి అవహేళన చేశారని, క్రమశిక్షణ రాహిత్యాన్ని పాల్పడ్డారని పేర్కొంటూ జిల్లా కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొరివి అరవింద్ కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ చౌక్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కు మార్ గౌడ్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. కాంగ్రెస్ ఎస్సీ సెల్ తోపాటు అంబేడ్కర్ సంఘం అధ్యక్షులు కె ప్రభాకర్, మాదిగ విద్యార్ధి సంఘం అధ్యక్షుడు మా తంగి నరేష్ రాజేందర్రావును తీరును తప్పుపట్టారు. కేవలం దళితుడైనందున కవ్వంపల్లి ఫోటో పెట్టలేదని, రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని వారు హెచ్చరించారు. రాజేందర్రావును పా ర్టీ నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.

- రాజేందర్ రావు చిత్రపటానికి పాలాభిషేకం...

రాజేందర్ రావు అనుచరులు ఇదే తెలంగాణ చౌక్ లో ఆయన ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు. వెలిచాల మచ్చలేని నేత అని, దళితుల ఆత్మబంధువని ఆయన అభిమానులు పేర్కొంటూ పాలాభిషేకం చేశారు. 

వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా టవర్సర్కిల్, గాంధీ రోడ్ లో రాజేందర్ రావు యువసేన పేరిట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో ఆయనకు ఎలాంటి సంబం ధం లేదని, అది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఫ్లెక్సీ కాదని, ఆ ఫ్లెక్సీలో కవ్వంపల్లి ఫోటో పెట్టలేదని ధర్నా చేయడం సరైంది కాదని పేర్కొన్నారు. తాము కూడా దళితులమేనని, రాజేందర్ రావు అన్న, ఆయన తండ్రి జగపతిరావు అన్న మాకు చాలా అభిమానమని ఈ సందర్భంగాగుర్తుచేశారు.