calender_icon.png 5 September, 2025 | 4:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణికి, జెన్‌కోకు అవార్డులు

05-09-2025 01:27:36 AM

-ముంబైలో జరిగిన కార్యక్రమంలో అవార్డుల ప్రదానం  

-పాల్గొన్న కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, సతీష్‌చంద్ర దూబే

 హైదరాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి) : పర్యావరణహితం, సంక్షేమం, సౌక ర్యాల కల్పనలో సింగరేణి సంస్థ ఉత్తమ కంపెనీగా జాతీయ స్థాయిలో నాలుగు బొ గ్గు గనులకు పైవ్‌స్టార్ రేటింగ్ సాధించింది. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేతుల మీదుగా గురువారం ముంబైలో సింగరేణి సీఎండీ ఎన్.బలరామ్ అవార్డులను అందుకున్నారు.

రామగుండం  ఏరియాకి చెం దిన ఆర్‌జీవోసీ ఎక్స్‌టెన్షన్, ఇల్లందు ఏరియాకిచెందిన జేకే ఓసీ భూగర్బగనుల్లో శ్రీరాంపూర్ ఏరియాకు చెందిన ఆర్కే  గని, ఆర్కే న్యూటెక్ గనులు ఉన్నాయి. పర్యావరణ చర్యలు, సంక్షేమం, ఉత్పత్తి సాంకేతిక వంటి అంశాల్లో ఉత్తమ ప్రమాణాలు పాటిస్తున్నందు వల్లే అవార్డులు సాధించుకో వడం జరిగిందని ఎండీ బలరామ్ పేర్కొన్నారు.

గతంలో ఎన్నడు లేని విధంగా నాలు గు గనులకు 5 స్టార్ రేటింగ్ లభించడంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. తాడిచెర్లచూ1 ఓపెన్ కాస్ట్ కోల్ మైన్‌లో ఆదర్శమైన పనితీరును కనబర్చిన తెలంగాణ జెన్‌కో కూడా 5స్టార్ రేటింగ్‌ను సాధించింది. బొగ్గు తవ్వకంలో అత్యున్నత ప్రమాణాలను పాటిం చడంతో పాటు రేటింగ్ సామర్థ్యంగల బొ గ్గును ఉత్పత్తి చేయడంతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్‌కు అనుగునంగా ఉత్పత్తి సాధించిందన్నారు కేంద్ర బొగ్గు గనుల సహాయ మంత్రి సతీష్‌చంద్ర దూబే చేతులు మీదుగా తెలంగాణ జెన్‌కో అధికారులు బి. నాగ్య, పి. మోహన్‌రావు  అవార్డులు అందుకున్నారు.