calender_icon.png 25 September, 2025 | 12:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహాత్మ జ్యోతిరావు ఫూలే దంపతులకు భారత రత్నతో గౌరవించాలి

24-09-2025 10:53:56 PM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): సామాజిక ఉద్యమానికి నాంది పలికి, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, స్త్రీ విద్యా, స్త్రీ సాధికారిక కోసం, మూఢనమ్మకాల నిర్మూలన కోసం, అహర్నిశలు కృషి చేసిన మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతులకు కేంద్ర ప్రభుత్వం భారత రత్న బిరుదుతో గౌరవించాలని అఖీల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పెట్కులే అన్నారు. సత్యశోధక స్థాపన 152వ దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా కేంద్రంలోని సాంఘిక సంక్షేమ శాఖ కార్యాలయ ఆవరణలోని మహాత్మ జ్యోతిరావు ఫులే దంపతుల విగ్రహాలకు మాలి మహా సంఘం, సావిత్రిబాయి పూలే మహిళా మండలి సభ్యులతో కలిసి పూలమాలవేసి నివాలులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఫులే దంపతులు 24 సెప్టెంబర్ 1873న "సత్యశోధక సమాజాన్ని" స్థాపించి సమసమాజ నిర్మాణం కోసం, స్త్రీ విద్యా ,స్త్రీ సాధికారత, స్త్రీల హక్కుల కోసం ,సామాజిక న్యాయం కోసం అహర్నిశలు తమ జీవితాంతం కృషి చేసిన గొప్ప త్యాగమూర్తులని గుర్తు చేశారు. వారిని ఆదర్శంగా తీసుకుని భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహాత్మ జ్యోతిబాపూలేను తన గురువుగా భావించి భారత రాజ్యాంగాన్ని రాశారన్నారు.