30-09-2025 05:12:48 PM
చిట్యాల (విజయక్రాంతి): మండలంలోని ఎలేటి రామయ్యపల్లి గ్రామంలో నిర్మిస్తున్న అభయ ఆంజనేయస్వామి గుడి నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. మంగళవారం గ్రామానికి చెందిన కొత్తురి విజేందర్ రెడ్డి రూ. 1,11,116లు అందజేసి ఉదారతను చాటుకున్నారు. ఈ విరాళం ఆలయ నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి సహాయపడుతుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా విరాళాన్ని అభినందిస్తూ వారికి ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు, భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. మరికొంతమంది దాతలు ముందుకు వచ్చి ఆలయ నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముసాపురి శ్రీను, రాజు, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.