30-09-2025 05:42:39 PM
జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య
నకిరేకల్ (విజయక్రాంతి): రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రామన్నపేట మండలంలో సిపిఎం అభ్యర్థులను ఆదరించి ప్రజలు గెలిపించాలని, అభ్యర్థుల గెలుపు కోసం సిపిఎం కార్యకర్తలు క్షేత్రస్థాయిలో కృషి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు జల్లెల పెంటయ్య పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సిపిఎం మండల కార్యాలయంలో కూరేళ్ళ నరసింహ చారి అధ్యక్షతన జరిగిన మండల కమిటీ సమావేశంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో గత కాలం నుండి నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల పక్షాన గొంతుకై పోరాడుతున్న సిపిఎం శ్రేణులను ప్రజలు గ్రామీణ స్థాయిలో ఆదరించి సర్పంచులుగా, ఎంపీటీసీలుగా, వార్డు సభ్యులుగా గెలిపించాలని ఆయన కోరారు.
ఓటర్లు డబ్బు, మద్యం ప్రలోభాలకు లొంగకుండా నిజాయితీగా నిబద్ధతగా ప్రజల కోసం పనిచేసే కమ్యూనిస్టులను గెలిపిస్తే గ్రామాలు ఆదర్శంగా అభివృద్ధి చెందుతాయని గుర్తు చేశారు. సిపిఎం అభ్యర్థుల గెలుపు కోసం మండల వ్యాప్తంగా పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని, ఎన్నికలకు సన్నద్ధం కావాలని, క్షేత్రస్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బొడ్డుపల్లి వెంకటేశం, జిల్లా కమిటీ సభ్యులు వనం ఉపేందర్, బల్గూరి అంజయ్య, మండల కార్యదర్శివర్గ సభ్యులు బోయిని ఆనంద్, కందుల హనుమంతు, మండల కమిటి సభ్యులు గన్నేబోయిన విజయభాస్కర్, బావండ్లపల్లి బాలరాజు, మీర్ ఖాజా అలీ, నాగటి ఉపేందర్, ఎండీ రషీద్, తొలుపునూరి శ్రీనివాస్, వేముల సైదులు, ఆవనగంటి నగేష్, మేడి గణేష్, ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్షులు గంటెపాక శివ కుమార్,పుట్టల ఉదయ్ కుమార్, గంగదేవి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.