30-09-2025 05:18:32 PM
రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ జిల్లా టీం లీడర్ యామంకీ అనిల్..
చిట్యాల (విజయక్రాంతి): నిస్సహాయులు, నిరుపేదలకు రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ఒక వరం లాటిందని, కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ఉచితంగా తెలంగాణ ప్రభుత్వం అందిస్తుందని రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ జిల్లా టీం లీడర్ యామంకీ అనిల్ అన్నారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని డ్యూటీ డాక్టర్ క్రాంతితో కలిసి ఆరోగ్యశ్రీ వార్డును ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నాణ్యమైన వైద్య సేవలు అందించడం కోసం రూ.5 లక్షలుగా ఉన్న సహాయాన్ని రూ.10 లక్షలకు పెంచినట్లు చెప్పారు. దీంతో కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని ప్రభుత్వ ,ప్రైవేటు ఆస్పత్రులలో ఉచితంగా పొందవచ్చు అని తెలిపారు.ఆరోగ్యశ్రీ సేవల కోసం ఆసుపత్రిలో ఆరోగ్య మిత్రను సంప్రదించి రేషన్,ఆధార్ కార్డుతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.ఆయన వెంట ఆరోగ్య మిత్రలు గుర్రపు రాజమౌళి, స్వప్న,దేవి తదితరులు ఉన్నారు.