30-09-2025 05:23:49 PM
నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లాలో ఆమ్ ఆద్మీ పార్టీ బలోపితానికి కృషి చేద్దామని పార్టీ జిల్లా కన్వీనర్ సయ్యద్ హైదర్ అన్నారు. మంగళవారం నిర్మల్ జిల్లా కేంద్రంలో పార్టీ సమావేశం నిర్వహించి ఆయా మండలాలకు పార్టీ బాధ్యులను నియమించారు. కేజ్రీవాల్ నాయకత్వంలో ఆమ్ ఆద్మీ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో తన పార్టీ అభ్యర్థులను నిలబెడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్ వినోద్ తదితరులు పాల్గొన్నారు.