calender_icon.png 30 September, 2025 | 6:55 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనాధ శరణాలయం వృద్ధులకు దుస్తులు పంపిణీ

30-09-2025 05:14:51 PM

మందమర్రి (విజయక్రాంతి): జిల్లాలోని శ్రీరాంపూర్ శ్రీ సాయి అనాధ వృధాశ్రమం వృద్ధులకు పట్టణంలోని బురదగూడెం త్రిశక్తి, అష్టలక్ష్మి, కామాఖ్య దేవి, మహంకాళి దేవాలయం ఆధ్వర్యంలో దుస్తులు, నిత్యావసర సరుకులు అందజేశారు. దేవాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆలయ పూజారి సతీష్ భవాని చేతుల మీదుగా వృద్ధులకు దుస్తులు, దసరా పండుగ సందర్భంగా ఒకరోజు భోజనానికి అవసరమైన నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి సతీష్ భవాని మాట్లాడుతూ తెలంగాణలోనే అత్యంత వైభవంగా  జరుపుకునే దసరా పండుగను అనాధ శరణాలయం వృద్ధులు పండుగను సంతోషంగా జరుపుకోవాలనే ఆశయంతో దుస్తులు, నిత్యావసర సరుకులు అందించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.