30-09-2025 05:09:23 PM
నిర్మల్ (విజయక్రాంతి): ఇటీవల వెలువడిన నీట్ పరీక్ష ఫలితాలలో మామడ మండలం, పోన్కల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సయ్యద్ ఆజాం ఎంబీబీఎస్ సీట్ సాధించడంతో డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావు మంగళవారం సన్మానం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీహరి రావు మంగళవారం క్యాంప్ కార్యాలయంలో సయ్యద్ సోఫియాన్ ను శాలువాతో సన్మానించి, ఆయనకు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆశిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, నల్లల లింగారెడ్డి, శ్రీనివాస్ గౌడ్, అర్గుల రమణ అంబేకర్ ప్రసాద్, శ్రీహరి మహేందర్ కార్యకర్తలు ఉన్నారు.