calender_icon.png 30 September, 2025 | 6:48 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓపెన్ స్కూల్స్ లో చేరే విధంగా బాధ్యత వహించాలి

30-09-2025 05:27:46 PM

చిట్యాల (విజయక్రాంతి): మధ్యలోనే చదువు మానేసిన విద్యార్థులను గుర్తించి ఓపెన్ స్కూల్ లో చేరేవిధంగా అందరు బాధ్యత వహించాలని ఎంపిడిఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మండల ప్రత్యేక అధికారి శ్రవణ్ మంగళవారం తెలిపారు. ఆయన అధ్యక్షతన తెలంగాణ ఓపెన్ స్కూల్ అడ్మిషన్ గురించి మండలంలోని ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఏపీఎం, ఐసిడిఎస్ సూపర్ వైజర్, వివోఏ లు, అంగన్వాడీ టీచర్లకు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా మన మండలంలోని అన్ని గ్రామాలలో, మీ పరిధిలో ఆర్ధిక ఇబ్బందుల వల్ల, కొన్ని అనివార్య కారణాల వలన మధ్యలో చదువు మానేసిన, పదవ తరగతి ఫెయిల్ అయిన, పదవ తరగతి పాస్ అయ్యి ఇంటర్ చదవలేకపోయినా, ఇంటర్ ఫెయిల్ అయిన వారిని గుర్తించి ఓపెన్ టెన్త్, ఓపెన్ ఇంటర్ లో చేరే విధంగా బాధ్యత వహించాలని, ప్రతి గ్రామం నుండి 5 గాని, అంతకంటే ఎక్కువ మంది ఓపెన్ స్కూల్ నందు నమోదు అయ్యేవిధంగా చూడాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ జయలక్ష్మి మాట్లాడుతూ మీ ఆవాస ప్రాంతాలలో బడి మానేసిన వారిని గాని, పదవ తరగతి ఫెయిల్ అయిన, ఇంటర్ ఫెయిల్ అయిన గాని గుర్తించి వారిని ఓపెన్ స్కూల్ నందు అడ్మిషన్ పొందే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.  ప్రతి సమభావన సంఘం నుండి ముగ్గురు చొప్పున 100 అడ్మిషన్స్ అయ్యేవిధంగా వివోఏ లు కృషి చేయాలనీ తెలిపారు. మండల విద్యాధికారి సైదా నాయక్ మాట్లాడుతు  31ఆగస్ట్ 2025 నాటికి ఓపెన్ టెన్త్ కు 14 సంవత్సరాల వయసు, ఓపెన్ ఇంటర్ కు 15 సంవత్సరాలు వయసు నిండిన వారు అర్హులు అని. ఓపెన్ టెన్త్ రాయాల్సిన వాళ్లు ఏ తరగతి వరకు చదివారో ఆ తరగతికి సంబంధించిన బోనఫైడ్ సర్టిఫికెట్,  క్యాస్ట్ సర్టిఫికెట్, ఆధార్ కార్డు, ఒక ఫోటో, ఓపెన్ ఇంటర్ కొరకు పదవ తరగతి పాస్ మెమో, ఒరిజినల్ టి సి, ఆధార్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికెట్లు కావలెను. చిట్యాల మండలంలో ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్ జెడ్పిహెచ్ఎస్ చిన్నకాపర్తి నందు గలదని, ఓపెన్ స్కూల్ అడ్మిషన్స్ సంబంధించి వివరాల కొరకు సెంటర్ సహాయక కోఆర్డినేటర్ చంద్రశేఖర్ యొక్క ఫోన్ నెంబర్: 9441291637 ను సంప్రదించగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం శ్రీదేవి, ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రామ్ మోహన్, శ్రీనయ చారి, వెంకట్ రెడ్డి, యాదయ్య, వివో ఏ లు  అంగన్వాడీ టీచర్స్  పాల్గొన్నారు.