18-10-2025 03:11:34 PM
పెద్ద సంఖ్యలో పాల్గొన్న పలు పార్టీల నేతలు
సుల్తానాబాద్,(విజయక్రాంతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన బీసీ బందులో భాగంగా శనివారం సుల్తానాబాద్ పట్టణంలో అఖిలపక్షాల ఆధ్వర్యంలో బంధు విజయవంతమైంది .. కాంగ్రెస్, బిఆర్ఎస్, బిజెపి, బహుజన సమాజ్ పార్టీ లతోపాటు అన్ని కుల సంఘాల నాయకులు బందులో పాల్గొన్నారు. ఉదయం నుండి పట్టణంలో కలియ తిరిగిన అఖిలపక్షం నేతలు వ్యాపార వాణిజ్య సముదాయాలతో పాటు సినిమా హాల్ పాఠశాలలను మూయించి వేశారు.
పట్టణంలో ర్యాలీగా తిరిగిన అనంతరం స్థానిక అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా పలువురు పార్టీ నేతలు మాట్లాడుతూ, అత్యధికంగా ఉన్న బీసీలకు రాజ్యాధికారం రావాలని, పెద్ద ఎత్తున ఎగిసిపడుతున్న ఉద్యమానికి బీసీ లందరూ మద్దతుగా నిలవాలని బీసీల ఐక్యతను సాధించేంతవరకు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని అన్నారు.
రానున్న రోజుల్లో బీసీలు రాజ్యాధికారం చేపట్టే దిశగా అడుగులు వేయాలన్నారు. 42 శాతం కచ్చితంగా అమలు చేసి తీరే విధంగా ఉద్యమించాలన్నారు. అలాగే సుల్తానాబాద్ వాకర్స్ ఆధ్వర్యంలో బీసీలకు మద్దతుగా ద్విచక్ర వాహనాలతో ర్యాలీ నిర్వహించడం జరిగింది... ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నేతలు పాల్గొనగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ సుబ్బారెడ్డి, ఎస్సై శ్రావణ్ కుమార్, అశోక్ రెడ్డిల ఆధ్వర్యంలో భారీ పోలీస్ బందోబస్తు నిర్వహించారు.