18-10-2025 03:08:06 PM
చిలుకూరు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా తలపెట్టిన బీసీ బందులో భాగంగా శనివారం చిలుకూరు మండల కేంద్రంలోని కోదాడ జడ్చర్ల జాతీయ రహదారిపై అఖిలపక్షాల ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి బంద్ చేపట్టారు. ఈ బందుకు కాంగ్రెస్, బిజెపి, కూడా మద్దతు తెలిపాయి,ఈ కార్యక్రమంలో పలువురు మాట్లాడుతూ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం అన్ని విధాలుగా పోరాడుతామని రిజర్వేషన్ విషయంలో వెనకడుగు వేసే ప్రసక్తే లేదని, రాజకీయాలు ఎన్నికల వరకేనని రిజర్వేషన్ విషయంలో అందరం ఏకం కావలసిన అవసరం ఉందని, పార్లమెంట్లో చట్ట సవరణ చేసి బీసీ రిజర్వేషన్ కు చట్టబద్ధత కల్పించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ, బీ ఆర్ఎస్, కాంగ్రెస్, బిజెపి, సిపిఎం, వివిధ పార్టీల నాయకులు కార్యకర్తలు బందులో పాల్గొన్నారు.