18-10-2025 03:17:55 PM
గాంధారి,(విజయక్రాంతి): రాష్ట్ర స్థాయి ఎస్జీఫ్ పాఠశాల స్తాయి అండర్ 17 వాలీబాల్ పోటీలకు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెట్ సంగం విద్యార్థిని సృజన ఎంపీల అయినట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు లక్ష్మణ్ రాథోడ్ తెలిపారు. ఈ నెల 14 న కామారెడ్డి డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో జరిగిన ఉమ్మడి నిజామాబాద్ కామారెడ్డి జిల్లా స్తాయి పోటీలో మొదటి స్థానం సాధించి రాష్ట్ర స్థాయికి ఎంపిక అయింది. ఈ నెల 18 నుండి మహబూబ్ నగర్ లో జరుగుతున్న రాష్ట్ర స్థాయి పోటీలకు ఉమ్మడి జిల్లా నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు ఆయన తెలిపారు, రాష్ట్ర స్థాయికి ఎంపిక అయిన సృజన కు ప్రధాన ఉపాధ్యాయుడు కుమార స్వామి ఉపాధ్యాయ బృందం గ్రామస్థులు అభినందించారు.