calender_icon.png 6 July, 2025 | 6:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆర్థికంగా ప్రతి ఒక్కరూ ఎదగాలన్నదే మా సంకల్పం

03-07-2025 12:00:00 AM

ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి

మహబూబ్ నగర్ జూలై 2 (విజయక్రాంతి) : ఆర్థికంగా ప్రతి ఒక్కరు ఎదగాలన్నదే ప్రజా పాలన ప్రభుత్వ ధ్యేయమని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి అన్నారు. బుధవారం గోప్లాపూర్లో  రూ 25 లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన,త్రాగునీటి బోర్ల ప్రారంభం, ఉచిత కుట్టుమిషన్ శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు ఎమ్మెల్యే అందజేశారు.

ప్రతి గ్రామానికి మెరుగైన మౌలిక సదుపాయాలు అందించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పని చేస్తోందని, గోప్లాపూర్ అభివృద్ధికి ఇవి మరో ముందడుగన్నారు. గ్రామ ప్రజల కోసం ఏ రంగంలోనైనా అవసరమైన సహాయాన్ని అందించేందుకు నేను కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులుఉన్నారు.