16-12-2024 04:27:42 PM
హైదరాబాద్,(విజయక్రాంతి): ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన భుజంగరావుకు తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ గుడువును పొడిగించింది. వచ్చే సోమవారం వరకు భుజంగరావు బెయిల్ ను పొడిగిస్తూ కోర్టు తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉక్కుపాదం మోపింది. ఈ కేసులో హైదరాబాద్ నగర టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, మాజీ అదనపు ఎస్పీ భుజంగరావు, పలువురు ఉన్నతాధికారులను అదుపులోకి తీసుకొని విచారించారు.