calender_icon.png 25 August, 2025 | 5:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ స్థలం కబ్జా కాకుండా చర్యలు తీసుకోవాలి

16-12-2024 04:20:30 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేట్ స్టేడియం, మైదాన స్థలం కబ్జా కాకుండా రక్షణ చర్యలను వెంటనే చేపట్టాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఎన్టీఆర్ స్టేడియంలో గల మైదానాన్ని పరిశీలించి రక్షణ చర్యలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మున్సిపల్ చైర్మన్ కమిషనర్ అహ్మద్ క్రీడల అధికారి శ్రీకాంత్ రెడ్డితో స్థల పరిరక్షణపై యాక్షన్ ప్లాన్ ను రూపొందించి తనకు నివేదిక అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు దేవదాస్ సిబ్బంది పాల్గొన్నారు.