05-11-2025 12:00:00 AM
-క్రీడల ప్రోత్సాహానికి కట్టుబడి ఉన్నాం: మంత్రి వాకిటి శ్రీహరి
హైదరాబాద్, నవంబర్ 4: తెలంగాణలో క్రీడల ప్రోత్సాహానికి ప్రభుత్వం కట్టుబడి ఉం దని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి స్పష్టం చేశారు. గచ్చిబౌలీ స్టేడియంలో తెలంగాణ ఇండియా ఇంటర్నేషనల్ ఛాలెంజర్ 2025 బ్యాడింటన్ టోర్నీని భారత జట్టు చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా రానున్న రోజు ల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో కూడా అంతర్జాతీయ స్థాయి పోటీలు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు.
హైదరాబాద్ బ్యాడ్మింటన్‌కు హబ్ గా నిలిచిందని, ఎంతో మంది చాంపియన్లను తయారు చేసిందన్నారు. భవిష్యత్తులో మరింతమంది తెలంగాణ నుంచే రావాలని తెలంగాణ ప్రభుత్వ క్రీడల సలహాదారు జితేందర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. గత రెండేళ్లలో పలు టోర్నీలను విజయవంతంగా నిర్వ హించేందుకు ఎంతో కృషి చేశామని తెలంగాణ స్పోర్ట్స్ అథారిటీ ఛైర్మన్ శివసేనారెడ్డి చెప్పారు. కాగా తెలంగాణ ఇండియా ఇంటర్నేషనల్ ఛాలెంజర్ టోర్నీకి రాష్ట్ర ప్రభుత్వ సహకారం మరువలేనిదని, శాట్స్ ఛైర్మన్ , ఇతర అధికారులు చక్కని సమన్వయంతో మద్ధతుగా నిలిచారని బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ చెప్పారు.